చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'మహానాడు' ఉత్సవాలు పండుగ వాతావరణంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గవ్యాప్తంగా 10 క్లస్టర్ల పరిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా క్లస్టర్ - 1, 2, 5 లలో జరిగిన మహానాడులో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిలకలూరిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ కరీముల్లా పరిశీలకులుగా హాజరయ్యారు. నియోజకవర్గ నాయకులు, గ్రామాలనుంచి తరలివచ్చిన కార్యకర్తలతో మహానాడు వేదిక సందడిగా మారింది.