మనబడి మన పండుగ: విద్యార్థులకు ఘన స్వాగతం

శుక్రవారం, చీరాల మండలంలోని ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్ పేరాలలో పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా 'మనబడి మన పండుగ' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలికారు, మొక్కలు నాటారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అందజేశారు. విద్యార్థులతో సరదా ఆటలు కూడా ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ రావు, ఉపాధ్యాయులు జగన్నాధచార్యులు, సుబ్రహ్మణ్య కుమార్, మాధవి, జ్యోతి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్