మార్టూరు: హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్

మార్టూరు లో జరిగిన పిండ్రాల పోలయ్య అనే వ్యక్తి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ శేషగిరిరావు సోమవారం చెప్పారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలయ్య పై ఆయన సమీప బంధువులు ఈనెల 10వ తేదీన నాపరాయి ముక్కలతో దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 12వ తేదీ మరణించాడు. పోలయ్య మరణ వాంగ్మూల౦ ఆధారంగా కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.

సంబంధిత పోస్ట్