కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్సాంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చీరాలలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా జరిగింది. గడియార స్తంభం కూడలి వద్ద జరిగిన ఈ నిరసనలో పార్టీ శ్రేణులు ఖర్గేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి నాశన మణికుమార్ పాల్గొన్నారు.