రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించాలని చీరాల మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ గారికి రాష్ట్రోపాధ్యాయ సంఘం చీరాల మండల శాఖ తరుపున మెమోరాండం సమర్పించింది. ఈ కార్యక్రమంలో చీరాల ప్రతినిధులు ప్రభాకర్ రావు, ఏసురత్నం, బి వెంకటేశ్వర్లు, కే సుబ్బారావు, టి వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, జి వి సుబ్బారెడ్డి, ఏ శ్రీదేవి, పి పార్వతి, పి ఉమాదేవి, పివి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం ఎస్టియు సంఘం ఈ ఉద్యమాన్ని చేపట్టింది.