ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, కూటమి హామీల అమలుపై ఎమ్మెల్యే కొండయ్య స్పష్టీకరణ

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బందితో కలిసి చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పోతురాజు నాగు, దుర్గ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్