తుఫాను బాధితులకు అండగా ఎంపీ, మంత్రి: పంట నష్టాన్ని పరిశీలించి భరోసా

బాపట్ల లోక్ సభ ప్యానల్ స్పీకర్ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు శ్రీ గొట్టిపాటి రవి కుమార్ ఈరోజు అద్దంకి మండలం పరిధిలోని ముంత తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలను సందర్శించారు. కోటికలపూడి, కుంకుపాడు గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ పంట పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని, తగిన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మోదేపల్లి గ్రామంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వంతెనను కూడా పరిశీలించి, మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్