పీఆర్సీ, ఐఆర్, బకాయిల చెల్లింపు: ఎస్టీయూ దశలవారీ పోరాటం

పి ఆర్ సి కమిటీ ఏర్పాటు, ఐ ఆర్ మంజూరు, బకాయిల చెల్లింపు వంటి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఎస్టీయూ దశలవారీ పోరాటం నిర్వహిస్తుందని ఎస్టీయూ చీరాల డివిజన్ ప్రతినిధులు ప్రభాకర్ రావు, ఏసురత్నం తెలిపారు. గురువారం చీరాల ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీసులో పోరాటాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 30న మండల తాసిల్దార్లకు వినతిపత్రం, ఫిబ్రవరి 10న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ చీరాల ప్రతినిధులు టి వెంకటేశ్వర్లు, కె సుబ్బారావు, రాజ్ కుమార్, జీవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్