ప్రైవేట్ బస్సు ముళ్ళకంపలోకి దూసుకెళ్లింది, ప్రయాణికులకు గాయాలు లేవు

ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి బెంగళూరు వెళ్లే క్రమంలో, వేములకోట నుండి కుంట వెళ్లే రహదారిలో రాయల్ ఓవైజ్ ట్రావెల్స్ (ఆర్.వి.టి) ప్రైవేట్ బస్సు ముళ్ళకంపలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు, బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రోజురోజుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్