బాపట్ల జిల్లా చీరాల డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డిఓ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం వేటపాలెం మండలం కొత్తపేట మన్యం అపాయింట్మెంట్స్ వద్ద అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని వేటపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ నిబంధనల అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.