చీరాలలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 216 జాతీయ రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఓ కారు ఆగి ఉన్న ట్రాక్టర్ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. శివనాగిరెడ్డి పెన్షన్ కోసం కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్ నుంచి సొంతూరు చిన్నగంజం వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.