విద్యార్థినులకు ఆత్మ రక్షణపై అవగాహన కార్యక్రమం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా, బాపట్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో తోటవారిపాలెం సాయి స్కూల్‌లో విద్యార్థినులకు ప్రత్యేక ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. చీరాల రూరల్ సీఐ, ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను ఎదుర్కోవడం, ప్రమాద పరిస్థితుల్లో స్పందించడం వంటి అంశాలపై విద్యార్థినులకు ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా మెలకువలు నేర్పించారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థినులకు భద్రతపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్