గ్రూప్-2లో మున్సిపల్ కమిషనర్ గా షేక్ రేష్మ ఘన విజయం

పామూరు పట్టణానికి చెందిన షేక్ రేష్మ, మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, కృషి, పట్టుదలతో గ్రూప్-2 పరీక్షల్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3గా విజయం సాధించారు. బీటెక్ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందిస్తూనే గ్రూప్-2కు సిద్ధమై ఈ ఘనత సాధించారు. తన తల్లిదండ్రుల కష్టం, గురువుల మార్గనిర్దేశమే తన విజయానికి కారణమని, ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నట్లు రేష్మ తెలిపారు. ఆమెకు ఉపాధ్యాయులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్