అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కోశాధికారిగా యర్రాకుల శ్రీనివాస్ యాదవ్‌ను నియమించారు. రాష్ట్ర అధ్యక్షులు చింకా నారాయణ రావు యాదవ్, జనరల్ సెక్రటరీ పెద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సంఘ ఐక్యత, అభివృద్ధికి కృషి చేస్తానని, యాదవ యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంఘటన చీరాలలో జరిగింది.