నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ ఉమామహేశ్వర్

మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ హెచ్చరించారు. చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల భద్రత, సాధికారతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళలపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీస్ శాఖ జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రజలు నిర్భయంగా ఫిర్యాదులు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్