ఆదివారం చీరాల గడియార స్తంభం సెంటర్‌లో ప్రముఖ సినీ నటుడు కృష్ణ జయంతి వేడుకలను అభిమానులు ఘనంగా ఆదివారం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు షేక్ సలాం ఆధ్వర్యంలో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి సేవా కార్యక్రమం చేపట్టారు. తెలుగు సినీ రంగానికి కృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమని అభిమానులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, యోహాన్ తదితరులు పాల్గొన్నారు.