రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల రెండవ జాబితాలో వేటపాలెం మండలానికి చెందిన పందిళ్ళపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు పొన్నూరి కీర్తి దుర్గా కామాక్షి, అవ్వరు భువనేశ్వరి ప్రవేశాలు సాధించారు. పాఠశాల హెచ్ఎం దేవరకొండ సరోజిని సోమవారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులను పలువురు అధ్యాపకులు అభినందించారు.