తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేలపాడు గ్రామం సమీపంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. HP పెట్రోల్ బంకు వెనుక ముళ్ల పొదలలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సాయంత్రం 5:30 గంటలకు ఆకస్మిక రైడ్ చేసి 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,020 నగదు, 2 టూ వీలర్లు, 1 ఆటో, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాటను నిర్వహిస్తున్న చావలి దేవదానం ఆర్గనైజర్‌గా గుర్తించారు. కొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు తదుపరి విచారణ కోసం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.