ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ‘టీం 99’ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో భాగంగా నియోజకవర్గంలో పార్టీ తాజా పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిణామాలను బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.