మోంథా తుఫాను బాధితులకు తెన్నేటి భరోసా

లోక్‌సభ ప్యానల్ స్పీకర్ మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్, 'మోంథా' తుఫాను కారణంగా నష్టపోయిన బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని గ్రామాలలో పర్యటించారు. తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని, వరద నీటితో నిలిచిపోయిన ప్రాంతాలను, దెబ్బతిన్న పంటలను, కూలిపోయిన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితులతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం, వేమూరు నియోజకవర్గం 'మోంథా' తుఫాను ప్రత్యేక అధికారి నాగిరెడ్డి, రేపల్లె RDO రామలక్ష్మి మరియు మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, తుఫాను నష్టం అంచనాలను త్వరగా సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్