కారంచేడు–చీరాల రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని రామారావు (53)గా పోలీసులు గుర్తించారు. ఆయన కారంచేడులో కుమార్తె వద్ద ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగించేవారని తెలిపారు. ప్రమాదంలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్న పోలీసులు, కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.