మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి సామాజిక స్ఫూర్తితో చీరాల సబ్ కోర్టు అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె కాత్యాయని విన్నుత రీతిలో శిక్ష విధించారు. గురువారం అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తీర్పు ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడి కోర్టుకు హాజరైన పదిమంది మందుబాబులకు ఆమె కమ్యూనిటీ సేవగా కోర్టు ప్రాంగణంలో మూడు రోజుల పాటు సమయపాలన పాటిస్తూ శుభ్రత పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.