చివరి స్నానం అంటూ అనంతలోకాలకు

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురానికి చెందిన దేవనపల్లి నాగలక్ష్మి, కుటుంబ సభ్యులతో కలిసి వేటపాలెం రామాపురం బీచ్‌లో సముద్ర స్నానాలకు వెళ్లింది. తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా, మేనల్లుడితో కలిసి మరోసారి స్నానం చేయడానికి సముద్రంలోకి దిగిన ఆమె, ఒక్కసారిగా ఎగిసిపడ్డ అలల ధాటికి కొట్టుకుపోయింది. ఆమెతో ఉన్న మేనల్లుడు సురక్షితంగా బయటపడగా, నాగలక్ష్మి ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీ మహ్మద్ మొయిన్ ఘటనాస్థలానికి చేరుకుని డ్రోన్ కెమెరాతో కూడా గాలింపును కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్