గురువారం అర్ధరాత్రి బాపట్ల జిల్లా చీరాల మండలం పిట్టువారిపాలెం గ్రామంలో బుర్ల వెంకట సుబ్బయ్య నివాసముంటున్న రేకుల ఇంటిపై భారీ తాటి చెట్టు కూలింది. ఈదురుగాలుల తీవ్రతకు చెట్టు వేళ్లతో సహా పెకలించుకుని ఇంటిపై పడింది. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి నిలువ నీడలేకుండా పోయింది. ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు.