స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని , ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాలు , ట్రేడ్ యూనియన్లు, పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 5న జరుగు నిరసన ధర్నాలను చీరాల ప్రజలు జయప్రదం చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. చీరాల కార్యాలయంలో ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.