రెండు కార్లు ఢీ ముగ్గురికి గాయాలు

శుక్రవారం చీరాల వాడరేవు సమీపంలో బైపాస్ రోడ్డుపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఒక కారు రాంగ్ రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒక కారు బోల్తా పడగా, మరొక కారు తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చీరాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్