అండర్-17 బాలికల కబడ్డీ: వేటపాలెం టీం రన్నరప్

జిల్లా స్థాయిలో బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం అండర్-17 బాలికల కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వేటపాలెం మండల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి రన్నరప్ గా గుర్తింపు పొందింది. జట్టు కెప్టెన్ గాయత్రి, వైష్ణవి, హిమబిందు, రోజా, వర్షిత, శరణ్య లకు డిఈవో శ్రీనివాస్ సింగ్ ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా మండల ఎంఈఓలు, హెచ్ఎం డి. సరోజిని, పిడిలు జె. శ్రావణి, యు. హనుమంతరావు, టీచర్లు, విద్యార్థులు జట్టు సభ్యులను అభినందించారు.

సంబంధిత పోస్ట్