పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి ఫ్రెండ్స్ ఘన నివాళి

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలంలో ఆంధ్ర బ్యాంక్ రోడ్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగిపర్తి బాలకృష్ణ, వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్ తేజ, కొత్త శ్రీనివాసరావు, గట్టా రమేష్, ఆకుల ప్రసాదు, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్