వేటపాలెం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన అంబటి రాంబాబు దిష్టిబొమ్మను వేటపాలెం సెంటర్‌లో దహనం చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకం నిర్వహించారు. అంబటి రాంబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ, టిడిపి నాయకులు పాల్గొన్నారు.