అకాల మరణం చెందిన కానిస్టేబుల్ బిల్లా రమేష్ కుటుంబానికి ఆయన బ్యాచ్ కి చెందిన కానిస్టేబుళ్ళు అండగా నిలిచారు. వారంతా విరాళాలు వేసుకొని 1, 58, 500 రూపాయలు పోగేశారు. ఆ మొత్తాన్ని చీరాల డిఎస్పీ మోయిన్ శుక్రవారం వేటపాలెంలో నివసించే బిల్లా రమేష్ అమ్మమ్మకు అందజేశారు. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో రమేష్ ను ఆయన అమ్మమ్మ పెంచి పెద్ద చేశారు. మంచి కార్యానికి పూనుకున్న కానిస్టేబుళ్ళని ఎస్పీ డూడీ అభినందించారు.