వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామంలో శుక్రవారం రాత్రి మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని మసీదును ప్రారంభించారు. అనంతరం స్థానిక ముస్లిం సోదరులు, మత పెద్దలతో కలిసి ప్రార్థనలు జరిపారు. మసీదు అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఎమ్మెల్యే కొండయ్య తెలియజేశారు.