వేటపాలెం మండలం రామాపురం వద్ద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ వేడుకలకు చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య హాజరయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు వేదాధ్యయన విభాగం వారిచే విశ్వ మానవాళి శాంతి కొరకు కరుణాసముద్రుడైన భగవాన్ బాబా వారిని ప్రార్థిస్తూ ఏకాదశ రుద్రపారాయణ రుద్రోప్రాసన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.