వేటపాలెం లో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలుగు యువత అధ్యక్షులు దొగిపర్తి బాలకృష్ణ అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరుగా ఇంటికే పెన్షన్ నగదు అందుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నగదును పెంచి పేద ప్రజలకు అండగా నిలిచారని బాలకృష్ణ తెలిపారు.