అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఒక ట్రాక్టర్ ను వేటపాలెం ఎస్సై జనార్ధన్ గురువారం సాయంత్రం పట్టుకున్నారు. వేటపాలెం బైపాస్ లో ఆయన విధులు నిర్వర్తిస్తుండగా ఆ మార్గంలో ఇసుక లోడుతో వచ్చిన ట్రాక్టర్ ను నిలిపి అనుమతి పత్రాలు అడుగగా అవేమీ డ్రైవర్ వద్ద లేకపోవడంతో ట్రాక్టర్ ను వేటపాలెం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ జనార్థన్ తెలిపారు.