పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన వాకర్స్ అసోసియేషన్

చీరాలలో గురువారం ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఎన్. ఆర్. పి. ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వాకింగ్ సభ్యులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం, కూడు, గూడు, గుడ్డ పథకాలు చారిత్రాత్మకమైనవని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్