చీరాల మండలం అక్కయ్యపాలెం గ్రామంలో దీర్ఘకాలిక భూ సమస్యను పరిష్కరించుకునేందుకు సోమవారం జంగిలి ఉమా భారతి, మరో వ్యక్తి సమావేశమయ్యారు. ఈ చర్చ ఘర్షణకు దారితీయడంతో ఉమా భారతిపై దాడి జరిగింది. గాయపడిన ఆమెను చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.