రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

బాపట్ల జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీ సమీపంలో మినీ లారీ ఢీకొన్న ఘటనలో కొమ్మనబోయిన సుబ్బాయమ్మ (62) అనే మహిళ, ఐదు పాడి గేదెలు మృతిచెందాయి. పశువులను మేపుకొని ఇంటికి వస్తున్న సుబ్బాయమ్మను, పర్చూరు వైపు నుంచి చీరాలకు వేగంగా వస్తున్న మినీ గుడ్స్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు ఐదు గేదలు అక్కడికక్కడే మృతి చెందాయి. వాహనం డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్