గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటలలో జిల్లాలో 145 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నమోదైన మొత్తం 76,895 పాజిటివ్ కేసులకు గాను 75,789 మంది డిశ్చార్జ్ కాగా 431మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కరోనా పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.