యడ్లపాడు మండలంలోని స్పైసెస్ పార్క్ నందు ఉన్న నార్ల బార్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట మరియు యడ్లపాడు కొనుగోలు కేంద్రాలు తెరిచి 20 రోజులు గడిచినా, ఇప్పటివరకు 5, 000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు.