గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు బహిరంగ మద్యపానంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 245 మందిని గుర్తించారు. వీరిపై 188 పెట్టీ కేసులు, 53 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వైన్ షాపులు, బార్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు వంటి పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గుంటూరు ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. బహిరంగ మద్యపానం కనిపిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.