రాత్రి నుంచి పోలీస్ స్టేషన్‌లోనే అంబటి రాంబాబు

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన వైసీపీ నేత అంబటి రాంబాబు నిన్న రాత్రి 11 గంటల నుంచి గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ఆయనను జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాత్రి ఆయనకు ఇంటి నుంచి తెప్పించిన బీపీ, షుగర్ టాబ్లెట్లను అందించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్