అమరావతిలో మరో భారీ పెట్టుబడి ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. వరుణ్ హాస్పిటాలిటీ కన్సార్టియం, అకోర్ బ్రాండ్ ఆధ్వర్యంలో రూ. 210 కోట్ల వ్యయంతో 6.5 ఎకరాల్లో ఫైవ్ స్టార్ హోటల్‌తో పాటు అంతర్జాతీయ ప్రమాణాల కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో రాజధానిలో హాస్పిటాలిటీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని, పెట్టుబడులు, పర్యాటకం పెరిగే అవకాశం ఉందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.