ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేసిన అసిస్ట్

చిలకలూరిపేట ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అసిస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు సెయింట్ జోసఫ్ హాస్పిటల్కు 25 లక్షల రూపాయల విలువ కలిగిన 50 ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లను హాస్పిటల్ కు అందజేశారు. ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అసిస్ట్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు రోగులకు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వడ్లమాని రవి, డైరెక్టర్ జాష్టి రంగారావు, అసోసియేట్ డైరెక్టర్ వియాని, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్