గుంటూరు జిల్లా పట్టాభిపురంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ. 60 లక్షలు కాజేసిన ఘటన వెలుగుచూసింది. ఏలూరు జిల్లాకు చెందిన మణికంఠ, ఆయన బాబాయి రాజ్‌గౌడ్‌లకు ట్రేడింగ్‌లో భారీ రాబడులు వస్తాయని నరేశ్, సురేశ్‌బాబు, గోవర్ధన్‌రెడ్డి నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితులు విడతల వారీగా రూ. 60 లక్షలు పెట్టుబడి పెట్టారు. అనంతరం నిందితులు అందుబాటులో లేకపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.