వడదెబ్బతో వృద్ధురాలి మృతి

పెదనందిపాడు మండలం వరగాని ఎస్సీ కాలనీలో కట్టా దయమ్మ (60) అనే వృద్ధురాలు తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బతో మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె రోడ్డుపై కుప్పకూలిపోయారు. స్థానికులు, బంధువులు ఆమెను గుంటూరులోని కావ్య ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు టీడీపీ నాయకుడు కట్టా గాంధీ తెలిపారు.

సంబంధిత పోస్ట్