తిరుమల లడ్డూపై ఆరోపణలు అవాస్తవం: విడదల రజిని

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి విడదల రజిని తీవ్రంగా ఖండించారు. శుక్రవారం గుంటూరులో ఆమె మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. లడ్డూ తయారీలో కల్తీ జరగలేదని, సీబీఐ చార్జిషీట్ నివేదికలో కూడా అలాంటి ప్రస్తావన లేదని ఆమె స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆమె మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్