మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ గురువారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తనపై ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసులు నమోదు చేశారని, ట్రయల్ కోర్టు రిమాండ్ విధించిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసులను కొట్టివేసి ఊరట కల్పించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది.