గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన 101 ఏళ్ల హబీబున్నీసా నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆమెకు 12 మంది సంతానం కాగా, ప్రస్తుతం ఆమె కుటుంబం 140 మంది సభ్యులతో విస్తరించింది. శతాధిక వయస్సులోనూ ఖురాన్ చదువుతూ, చురుగ్గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసూయ, ద్వేషాలకు దూరంగా ఉండటమే ప్రశాంతమైన, సుదీర్ఘ జీవితానికి మార్గమని ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపజేస్తున్నాయి.