GNT: జూన్ 1 నుంచి ఆర్మీ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు

భారత సైన్యంలో అగ్నిపథ్ పథకం కింద నియామకాల కోసం నిర్వహించే ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుందని గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి రజత్ సువర్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ‘జాయిన్ ఇండియన్ ఆర్మీ’ వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేసి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్