GNT: మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసు.. ఒకరి అరెస్ట్

అమరావతి ఉద్యమ సమయంలో ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై జరిగిన దాడి కేసులో తుళ్లూరు పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. తాళ్లాయపాలెం జంక్షన్ వద్ద రైతులను పరామర్శించి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అదే గ్రామానికి చెందిన గడ్డం జాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు సీఐ కొంకా శ్రీనివాసరావు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్